Showing posts with label వర్షపు దారి. Show all posts
Showing posts with label వర్షపు దారి. Show all posts

Wednesday, October 15, 2014

వర్షపు దారి - రేణుక అయోలా



వాన చినుకుల్ని పట్టుకోవడమంటే బాల్యం నుంచీ అమితమైన ఇష్టం. వాన చినుకులను కవిత్వంలో ఎవరైన వర్షింపచేయడానికి ప్రయత్నించినప్పుడు చదవడానికి  అమితమైన ఆనందానికి లోనౌతాను.
ఈ కవితలో
తడి జ్ఞాపకం, పూలు రాల్తున్న మెత్తటి సుఖం, పడవతో ఆడుకోవడం, 
తడి ఆకాశం మబ్బులని తోసుకుంటూన్నదృశ్యం 
చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలిగుర్తులని 
గాలి గుర్తులు 
ఇవన్నీ ఎక్కడెక్కడికో తీసుకు వెళ్ళాయి. వానతో అనుబందమో, అనుభూతో వున్నవారినందరిని ఎక్కడో ఒకచోటికి లాక్కెళ్ళకుండా వుండదు. 

ఈ వానను, వానచినుకుల తడిని దేనికైనా ప్రతికలుగా అర్థం చేసుకోవచ్చా అని అలోచనలు ముసిరాయి. 
కచ్చితంగా ప్రతీకలుగా చదవొచ్చనే అనిపిస్తుంది. కవితయొక్క పరిథి చాలా విశాలమౌతుంది 
ఏదో తెలియని అనిర్వచనీయమన అనుభూతి వివరించలేకపోతున్నాననిపిస్తుంది. మీరే చదివి ఆనందించండి.

రేణుక అయోలా  గారికి అభినందనలు 
*~*~*

అరచేతిలో రాలిన చినుకులో ఏమి వుండవు
చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది
ఒక నాటి వాన జల్లు తడి జాపకం
ఏ ఒక్క మాట మరచిపోనంత చలి గాలి

పసుపు గన్నేరు పూలు బుజాలమీద
మెడఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం
ఖాళితనంలో చొరబడి చెవి పక్కనే వినిపించిన నవ్వు
ఎగిరిపోయిన గొడుగు దొరికి పోయిన శరీరం

కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం
దూరంగా వినిపించే చిన్నపిట్ట కూతరెక్కలో
తడి ఆకాశం మబ్బులని తోసుకుంటూన్నదృశ్యం

చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలిగుర్తులని
ఆ వర్షపు హాయిని చెప్తూనే వుంది
అరచేతి తడి ఇంకిపోయి వర్షపు దారి గుర్తు వుండిపోయింది ...