Showing posts with label వర్ష రాగము / శ్రీనివాస్/. Show all posts
Showing posts with label వర్ష రాగము / శ్రీనివాస్/. Show all posts

Thursday, June 13, 2013

వర్ష రాగము / శ్రీనివాస్/




చిట పట చినుకులు
కలిపెను చెలిమిని
తనవుల కలిగెను
తమకపు సెగలవి

వలపులు ముడిపడ
మనసులు జతపడ
మురిసెను మదనుడు
కలిపెను జతలను

వరుణుని కరుణను
తొలకరి చినుకులు
తరువులు గిరులును
మురవగ తడిపెను

జలదము లురిమెను
నభమది మెరిసెను
మనసున వరుసపు
సొగసులు కురిసెను

సొగసరి పుడమికి
గడసరి నభమది
చినుకుల ననుపుచు
వలపును తెలిపెను

పుడమికి ముదమయె
గగనపు వలపున
తడిసెను ఎడదను
చెరువున నిలిపెను


 http://www.facebook.com/maddali.srinivas.5